GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 7:21 pm Posted by : GARUDA DHATRI NEWS

లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు

*లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు*

*బయటకొడియంబేడు వద్ద వాహనాల తనిఖీ – రెండు ట్రాక్టర్లు సీజ్*

బయట కొడయంబేడు వద్ద ఈరోజు నిర్వహించిన వాహనాల తనిఖీలలో లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లను గుర్తించి, సంబంధిత రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని చెప్పారు.

లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నియమాలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ప్రజలు తప్పనిసరిగా చట్టాలను పాటిస్తూ, సరైన డ్రైవింగ్ లైసెన్స్‌తోనే వాహనాలు నడపాలని అధికారులు సూచించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.