GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 4:16 pm Posted by : GARUDA DHATRI NEWS

వజ్రవేలు మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటు – *మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

వజ్రవేలు మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటు –
*మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

✒️ నాగలాపురం మండలం గోపాలపురం హెడిసి కాలానికి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత వజ్రవేలు శనివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
సమాచారం అందుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదివారం గ్రామానికి చేరుకుని వజ్రవేలు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ, వజ్రవేలు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయన మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.