వడదెబ్బకు గురై వృద్ధురాలు మృతి
పిచ్చాటూరు మే 25 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో వడదెబ్బ కారణంగా ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆదివారం మండలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో నీరువాయి గ్రామానికి చెందిన క్రిష్టమ్మ (74) అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆమెకు కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. గ్రామంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు...