వడదెబ్బకు గురై వ్యక్తి మృతి
పిచ్చాటూరు, మే 31 గరుడధాత్రి : మండలంలోని కీలపూడి గ్రామానికి చెందిన వెంకటస్వామి కుమారుడు పేరయ్య (55) వడదెబ్బకు గురై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, శనివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పేరయ్య అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లు తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పేరయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు...