బి కొత్తకోట సెప్టెంబర్:19 (గరుడ ధాత్రి న్యూస్)
బి కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీ వడిగల వారిపల్లి రైతు భరోసా కేంద్రం నందు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 80% సబ్సిడీ ఉలవలు పంపిణీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఆదేశాల మేరకు శనివారం ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ జ్యోతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు,సంప్రదాయ పంటల ప్రాధాన్యతను పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు. సచివాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు లబ్ధిదారులకు ఉలవలను పంపిణీ చేశారు.ఉలవల్లో అధికంగా ప్రోటీన్లు,పీచు పదార్థాలు,ఖనిజాలు ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వారు తెలిపారు.ముఖ్యంగా గ్రామీణ ప్రజలు సంప్రదాయ ఆహార పదార్థాలను తమ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
ఉలవల పంపిణీ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది.అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సచివాలయ సిబ్బంది కోరారు.
ప్రజల ఆరోగ్యం,సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు కావడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దేవరింటి కుమార్ (శంకర్ యువసేన) దూలం రామప్ప గ్రామ అధ్యక్షులు రామిరెడ్డి జల్ల రామప్ప నరసింహులు తదితరులు పాల్గొన్నారు.