వడిగలవారి పల్లిలో ఉలవలు పంపిణీ

బి కొత్తకోట సెప్టెంబర్:19 (గరుడ ధాత్రి న్యూస్) బి కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీ వడిగల వారిపల్లి రైతు భరోసా కేంద్రం నందు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 80% సబ్సిడీ ఉలవలు పంపిణీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఆదేశాల మేరకు శనివారం ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ జ్యోతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు,సంప్రదాయ పంటల ప్రాధాన్యతను పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు. సచివాలయ సిబ్బంది,...