GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:28 am Posted by : GARUDA DHATRI NEWS

వన్డే ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

2027 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్‍ను ఐసీసీ విడుదల చేసింది. అహ్మదాబాదులో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో మ్యాచ్‌ల నిర్వహణ తేదీలను ప్రకటించారు.

వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దాదాపు 48 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది. చాలా వరకు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి, మొత్తం 54 మ్యాచ్‌లలో 41 దక్షిణాఫ్రికాలో, 8 నుంచి 10 జింబాబ్వేలో, మిగిలిన 3 నమీబియాలో నిర్వహిస్తారు. గతంలో 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో, 2027లో మళ్లీ 14 జట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు.