వరుణుడి కరుణ కోసం శెట్టిపేటలో ఘనంగా ‘కప్పదేవర’

చౌడేపల్లి ఆగస్టు 02 గరుడ దాత్రి న్యూస్ సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మండలంలోని శెట్టిపేట గ్రామస్తులు ప్రాచీన ఆచారమైన 'కప్పదేవర' (కప్పల పెళ్లి) వేడుకను ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక మోక్ష గణపతి ఆలయం వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించారు రుతుపవనాలు ముఖం చాటేయడం, ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నా చినుకు రాలకపోవడంతో సాగుకు సిద్ధమైన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాన దేవుడి కరుణ కోసం గ్రామస్తులంతా ఏకమై సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను జరిపారు. ​అంగరంగ...