వాడవాడలా వినాయక చవితి వేడుకలు
కార్వేటి నగరం సెప్టెంబర్ 15 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం మండల కేంద్రంలో సోమవారం వాడవాడలా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని గ్రామాలలో యువత వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. పచ్చ తోరణాలతో కట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాల వద్ద వివిధ రకాలైన పండ్లు పువ్వులు రంగులు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదపండితులు నడుమ వినాయకుని అభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు...