GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 9:26 pm Digital Edition : GURU SWAMY

వికోట మండలం లోజరిగిన రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి మండలవాసులు ముగ్గురు మృతి…

*వికోట మండలం లోజరిగిన రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి మండలవాసులు ముగ్గురు మృతి.*

 

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఏప్రిల్20

వికోట మండలం కొమ్మరిమడుగు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైరెడ్డిపల్లి వైపు నుంచి ద్విచక్రవాహనం లో హేమచంద్ర సరస్వతి. లలిత వీకోట వైపు వెళుతుండగా వికోట నుండి ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనం ను ఢీకొన్నది. ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న బైరెడ్డిపల్లి మండలం మేకలనాగిరెడ్డిపల్లి కి చెందిన హేమచంద్ర (40)సరస్వతి(35) తీవ్ర గాయాలు కు గురైయ్యారు. బాధితులు ను ఆసుపత్రికి 108 ద్వారా తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు.వారి కుమార్తె లలిత(10) కి తీవ్ర గాయాలు అందువలన పి ఈఎస్ ఆసుపత్రికి తరలించడం జరిగినది.

అనంతరం లలితను బెంగళూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మృతి చెందినట్లు తెలుస్తున్నది.ఒకే కుటుంబం కు చెందిన మేకలనాగిరెడ్డిపల్లి నివాసులుముగ్గురు రోడ్డు ప్రమాదం లో మృతి చెందడం గ్రామస్తులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.108 సిబ్బంది పైలెట్ రవిశంకర్,ఈ ఎం.టి ధనపాల్ బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.