GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 7:09 pm Digital Edition : GURU SWAMY

విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి అమ్మగారు మందలపు అచ్చమ్మ గారికి నివాళులర్పించిన

*విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి అమ్మగారు మందలపు అచ్చమ్మ గారికి నివాళులర్పించిన చిత్తూరు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు*..

పూతలపట్టు -26-04-26

పూతలపట్టు మండలం, పూతలపట్టు గ్రామానికి చెందిన విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి తల్లిగారు మందలపు అచ్చమ్మ కర్మక్రియలను ఆదివారం పూతలపట్టులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు పాల్గొని, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు, పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీ మోహన్, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మందలపు అచ్చమ్మ గారికి పుష్పాలు సమర్పించి ఘన నివాళులర్పించారు.

చిత్తూరు ఎంపీతో పాటు నివాళులర్పించిన వారిలో పూతలపట్టు కన్వీనర్ దొరబాబు చౌదరి. మాజీ కన్వీనర్ చంద్రమౌళి. సీనియర్ నాయకులు ఉప్పలపాటి బాబురావు. గుంటూరు మురళి నాయుడు. బిజెపి మండల అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు ఉన్నారు.