విజయవంతం గా నవచేతన శిక్షణ కార్యక్రమం

బాలల భవిష్యత్తుకు పునాది తొలి సంవత్సరాలే: డా. ధనుష్ పిచ్చాటూరు, జూన్ 9: పిచ్చాటూరు మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పులింగుంట జెడ్పీ హైస్కూల్‌లో 0-6 సంవత్సరాల పిల్లల కోసం చేపట్టనున్న నవచేతన AI-Enabled ECD Screening కార్యక్రమంపై మండల స్థాయి శిక్షణను మంగళవారం నిర్వహించారు. సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు బజావతి, సుమతి ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. ధనుష్, సీహెచ్‌ఓ శివయ్య, ఏఎన్‌ఎమ్ హిమాద్రి, వైద్య సిబ్బంది,...