-సామాజిక అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపు
సత్యవేడు, సెప్టెంబర్ 13 గరుడదాత్రి న్యూస్:
ముదిరాజ్ సామాజిక అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు విజయవాడ కేంద్రంగా నిర్వహించిన “ఆత్మీయ కలయిక” కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సంఘం నేతలు సమావేశమయ్యారు
రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ నేతృత్వంలో విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ మండపంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం నుంచి ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు, యువ నాయకులు చురుగ్గా పాల్గొన్నారు. ముదిరాజ్ కులస్తులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ పరిధిలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా గ్రామస్థాయి నుంచి వివిధ స్థాయిల్లోని పదవులకు పోటీ చేసి విజయాలు సాధించేలా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ముదిరాజులు సామాజికంగా రాజకీయంగా మరింత బలోపేతం కావాలంటే ఐక్యత, సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ
ముదిరాజ్ సంఘం నేతలు ఏం ఏం శివప్రసాద్, వెంకటేశులు, వేళూరు పురుషోత్తం, నరేంద్ర, కుమార్, ప్రతాప్, నాగరాజు, పృథ్వి, ఆనంద్, మునస్వామి, భాస్కర్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.