విజయవాడలో ముదిరాజుల ఆత్మీయ కలయిక
-సామాజిక అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపు సత్యవేడు, సెప్టెంబర్ 13 గరుడదాత్రి న్యూస్: ముదిరాజ్ సామాజిక అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు విజయవాడ కేంద్రంగా నిర్వహించిన “ఆత్మీయ కలయిక” కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సంఘం నేతలు సమావేశమయ్యారు రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ నేతృత్వంలో విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ మండపంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు...