GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 2:14 pm Digital Edition : GURU SWAMY

విజయోత్సవ సభకు భోజన ఏర్పాట్లు

ఎన్డీయే కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పాలనకు రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద నిర్వహించనున్న భారీ విజయోత్సవ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కూరపాటి శంకర్ రెడ్డి, కె.వి.బి.పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మునస్వామి యాదవ్ ఆదేశాల మేరకు, కె.వి.బి.పురం మండల టీడీపీ క్లస్టర్-4 ఇంచార్జి దొరబాబు నాయుడు ఆధ్వర్యంలో సభకు హాజరయ్యే టీడీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మరియు ప్రజలకు భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఏర్పాట్లను క్లస్టర్ ఇంచార్జి దొరబాబు నాయుడు, యూనిట్ ఇంచార్జి చెంచు ప్రకాష్ యాదవ్ స్వయంగా పర్యవేక్షిస్తూ, సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విజయోత్సవ సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయి.