విజయ్ వైపు అన్నాడీఎంకే మొగ్గు..

మారిన లెక్కలు: విజయ్ వైపు అన్నాడీఎంకే మొగ్గు.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఈపీఎస్! తమిళనాడు రాజకీయ పీఠంపై సందిగ్ధత కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. తెరవెనుక అనూహ్య సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే (AIADMK) పార్టీ విజయ్‌కు బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు చెన్నై రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా, విజయ్ రెండు...