విద్యార్థులకు ప్రత్యేక దుస్తులను దాతలు సహకారం తో పంపిణీ

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు17 బైరెడ్డిపల్లి గ్రామ పంచాయితీ కి చెందిన చీలంపల్లి లోని ఎం.పి.పి.పాఠశాల విద్యార్థులకు దాతల సహకారం తో సోమవారం ప్రత్యేక దుస్తులు పంపిణి చేశారు.విద్యార్థులకు చక్కటి క్రమశిక్షణ అలవడడానికి ఈ ప్రత్యేక దుస్తులు సహకరిస్తాయి అన్న ఉదేశ్యం తో పంపిణీ చేశామని దాతలు నాగరాజు,మునిరెడ్డి,, సూరి దినేష్,సోమశేకర్ శ్రీనివాసులుమనోహర్ లు పేర్కొన్నారు.అలాగే గౌడ లక్షన్ పాఠశాలకు మహనీయులు అంబేద్కర్,ఏ.పి.జే అబ్దుల్ కలాం, భారతమాత చిత్రపటాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో.ఎం.ఈ.ఓ లు జనార్ధన్ ,దేశమ్మ , సి.ఆర్.సి హెచ్.ఎం. మనోరంజనీ, ప్రధానోపాధ్యాయురాలు సురేఖ...