GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:29 am Digital Edition : GURU SWAMY

విద్యార్థులకు బహుమతులు పంపిణీ

పలమనేరు,ఆగష్టు 06 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు రూరల్ మండలం దొడ్డిపల్లి, మండిపేట కోటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో విద్యార్థులకు శ్రీపురం సీతారామయ్య నాగమణి చారిటబుల్ ట్రస్ట్,గురు శిష్య సేవా సంఘం, ప్రగతి పధం సంస్థ సoయుక్తంగా వ్యాసరచన పోటీలు గురువారం నిర్వహించారు.ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు.ఒక్కో పాఠశాలలో 30 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.మొదటి బహుమతి ఐదు మందికి,రెండవ బహుమతి ఐదు మందికి,ప్రోత్సాహక బహుమతులుగా మరో 20 మంది చొప్పున విద్యార్థులకు అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం పాల్గొని తమ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించి బహుమతులు అందజేయడం పట్ల నిర్వాహకులను సత్కరించారు.ఇందులో సంస్థ నిర్వాహకులు శ్రీ పురం సీతారామయ్య, వీరభద్ర గౌడ్, చంద్ర శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.