GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 8:14 pm Digital Edition : GURU SWAMY

విద్యార్థులకు విద్యార్థి దశ జీవితానికి తొలి అడుగులు -పూతలపట్టు సీఐ తిమ్మయ్య

పూతలపట్టు జూలై 29 (గరుడ దాత్రి న్యూస్) విద్యార్థులకు విద్యార్థి దశ జీవితానికి తొలి అడుగులని పూతలపట్టు సీఐ తిమ్మయ్య అన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు బుధవారం పూతలపట్టు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 9 10 తరగతుల విద్యార్థులకు నిత్యజీవితంలో జరిగే క్రైమ్ లు గురించి. పోలీసుచట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థులు స్కూటర్లు వాహనాలు నడపరాదని. 18 సంవత్సరాల తర్వాత వాహనాలు నడపాలని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలగాలని క్రమశిక్షణ ఉంటే విజ్ఞానం దానంతట అదే వస్తుందన్నారు. విద్యార్థి దశలో సమయం వృధా చేస్తే జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. బాలికలు బర్త్డే వేడుకలకు వేరే ఫంక్షన్లకు ఒంటరిగా వెళ్లకూడదన్నారు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తిని బండారాలు ఇచ్చిన తీసుకోకూడదన్నారు. తల్లిదండ్రులు మా పిల్లలు మాలాగా కష్టపడకూడదని ఉద్దేశంతో కూలీనాలు చేసి మిమ్మలను చదివిస్తున్నారని ప్రతి విద్యార్థి దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులకు. ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సమాజంలో దేనినైనా దొంగిలించవచ్చు కానీ చదువుకున్న విజ్ఞానాన్ని ఎవ్వరూ దొంగలించలేరని నిజాన్ని మీరు గ్రహించాలన్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం నేరదాక్షల నాయుడు. ఉపాధ్యాయునిఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు