బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు7
బైరెడ్డిపల్లి మండలం లోని దాసార్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులుకు సీజనల్ వ్యాధులు టై ఫాయిడ్, మలేరియా, డెంగ్యు పట్ల శుక్రవారం అవగాహన కార్యక్రమంకొనసాగింది. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా తీర్థం పి.హెచ్.సి. వైద్యాధికారిణి సుస్మిత ఆదేశాల మేరకు తీర్థం పీహెచ్ సి పరిధిలో ఉన్న దాసర్లపల్లిలో శుక్రవారం అంగన్వాడీ సెంటర్ నందు అవగాహన కార్యక్రమము యేర్పాటు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలోడిప్యూటీ ఆరోగ్య విద్య వైద్యాధికారిణి కాంతమ్మ మాట్లాడుతూ తల్లిపాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి ఒక గంట లోపే పాలు ఇవ్వడం మంచి దని తల్లిబిడ్డకు అనుభందం పెరుగుతుందని, తేలికగ జీర్ణంఅయి తాయని, ఎల్లప్పుడూ అందుబాటలో ఉంటా యి అని,ప్రాణాంతక వ్యాధులనుండి బిడ్డను కాపాడుతాయని, బిడ్డపెరుగుదలకు మంచి పౌష్టిక ఆహారం అని,6 నెలలవరకు బిడ్డకు తల్లి పాలే ఇవ్వా లని ,చెప్పడం జరిగింది. అలాగే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలి అని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అని, బయట అంగడి మరియు హోటల్ లోదొరికే ఆహారాన్ని తినరాద ని నీటిని కాచివడబోసిన నీటిని తాగాలని, మంచి భవిష్యత్తు కోసం యోగా, ధ్యానం లాంటివి చేయాలని చెప్పడం జరిగింది. ఈకార్యక్రమములో
ఏ.ఎన్. ఎం. కవిత, ఉపాద్యాయులు లోకేష్,రవిజేజ రామాంజీనమ్మ అంగన్వాడీ భారతి తదితరులు పాల్గొన్నారు.