GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 9:38 pm Digital Edition : GURU SWAMY

విద్యార్థులు సైబర్ నేరాలు, మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఐ మోహన్ రెడ్డి

పలమనేరు, ఆగస్టు 19 గరుడ ధాత్రి :
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, గంజాయి తదితర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు మరియు మహిళలపై జరుగుతున్న నేరాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద ఆన్‌లైన్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరాదని సీఐ సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని హితవు పలికారు. విద్యార్థులు తమ చదువుపై మాత్రమే దృష్టి సారించి, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత కోసం అమలులో ఉన్న చట్టాలతో పాటు, ఆపద సమయంలో తక్షణమే స్పందించే పోలీసు అత్యవసర సహాయ సేవల గురించి విద్యార్థులకు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కన్నయ్య, కళాశాల అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది మరియు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.