విద్యార్థుల నమోదు లక్ష్యాలను పూర్తి చేయాలి

పిచ్చాటూరు, జూన్ 20 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకు వేగవంతంగా నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థుల విషయంలో తప్పనిసరిగా రిలీజ్ రిక్వెస్ట్ రైజ్ చేయాలని, మూడు రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న రిలీజ్ రిక్వెస్ట్‌లను వెంటనే ఇంటేక్ చేసుకోవాలని ఆదేశించారు....