విద్యా సేవతో పాటు విశ్రాంత ఉద్యోగులకు సేవలు – జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానం

కార్వేటి నగరం సెప్టెంబర్ 12 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం: జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లె ప్రధానోపాధ్యాయులు శ్రీ బి. చెంగల్ రాజును కార్వేటినగరం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సెప్టెంబర్ 5న నిర్వహించిన జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికైన శ్రీ బి. చెంగల్ రాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కార్వేటినగరం విశ్రాంత ఉద్యోగుల సంఘం...