విద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండండి -ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి సూచన
తిరుపతి, మే 28 గరుడధాత్రి : బలమైన గాలి, వర్షం కురిసే సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి గురువారం ఒక ప్రకటనలో కోరారు. బలమైన గాలి, వర్షం కారణంగా సంస్థ పరిధిలో అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్తు లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాల్లో వినియోగదారులు తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బలమైన గాలి, వర్షం కురిసే...