విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం
విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు సత్యవేడు మండలంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎపిఎస్ పిడిసిఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు, తిరుపతి జిల్లా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపిఎస్ పి టిసిఎల్ విజిలెన్స్ ఇన్ స్పెక్టర్ విద్యుత్ భద్రతపై గోడపత్రికలను ముద్రించి, సత్యవేడు ఏఈ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు.అనంతరం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రి పరిసరాలు, బస్టాండ్ ప్రాంతాలలో విజిలెన్స్ సిబ్బంది మరియు విద్యుత్ శాఖ సిబ్బంది...