కుప్పం,సెప్టెంబర్ 25 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి):
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ మరోసారి విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరటను కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా రూ.629.35 కోట్ల విద్యుత్ ఛార్జీల (ట్రూడౌన్) తగ్గింపునకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కూడా రూ.924 కోట్ల మేర ఉపశమనం కల్పించగా, వరుసగా రెండో ఏడాది కూడా ఛార్జీలను తగ్గించి ప్రభుత్వం తన బాధ్యతాయుతమైన పాలనను చాటుకుంది. గత వైసీపీ హయాంలో ట్రూఅప్, ఇంధన సర్ఛార్జీలు, విద్యుత్ సుంకం పేరుతో ప్రజలపై ఏకంగా రూ.32,166 కోట్ల అదనపు భారాన్ని మోపిన విషయాన్ని గుర్తుచేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా అదనపు భారం వేయకుండా జాగ్రత్తలు తీసుకుందని స్పష్టం చేసింది.