వినాయక చవితి ప్రశాంతంగా నిర్వహించాలి – ఎస్సై బి. రాఘవేంద్ర

మండపాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి.. డీజేలకు నో పర్మిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్సై బి. రాఘవేంద్ర పిచ్చాటూరు, సెప్టెంబర్ 5 గరుడధాత్రి : వినాయక చవితి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలు, పుత్తూరు డీఎస్పీ, పుత్తూరు రూరల్ సీఐ సూచనల మేరకు పిచ్చాటూరు మండలంలో...