వినాయక నిమజ్జనం వేడుకలు డీజే నిషేధం – ఎస్సై తేజస్విని

కార్వేటినగరం సెప్టెంబర్ 18 వినాయక నిమజ్జనం వేడుకలుసందర్భముగా మండలములోని ప్రతి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వినాయకుని నిమజ్జనం ఉత్సవాల్లో భాగంగా ఎవరు గానీ ఎలాంటి డీజేలు గానీ, పాటకచేరిలు గాని,ఏ విధమైన అశ్లీల నృత్యాలు గాని జరుపుటకు అనుమతిలేదు.ఒకవేళ మీరు ఏదైనా ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చి ఉన్నచో దానిని వెనుకకు తీసుకోగలరు. పై ఉత్తర్వు ను అతిక్రమించినచో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడునని కార్వేటినగరం ఎస్సై తేజస్విని పోలీసువారి హేచ్చరిక కావున ప్రజలు భక్తి శ్రద్దలతో పండుగ జరుపుకోవాలని అన్నారు.