దూసుకుపోతున్న టీడీపీ ప్రచారం
నాగలాపురం, గరుడదాత్రి న్యూస్:
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 3వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి ప్రేమ సెల్వకుమార్ వినోభానగర్‌లో ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ప్రభుత్వం గ్రామానికి తారురోడ్డు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసిందని నాయకులు పేర్కొన్నారు. మరో అవకాశం కల్పిస్తే గ్రామంలోని మట్టి రోడ్లను తారు, సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయడంతో పాటు డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో భాస్కర్ శెట్టి, అన్షు, రాజవేలు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.