GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 11:02 am Posted by : GURU SWAMY

విశాఖ లో రూ. 1.77 లక్షల కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్

* సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ల కృషి ఫలితం.
కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): ఆంధ్రప్రదేశ్ కు మరో అతిపెద్ద డేటా సెంటర్ రానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, మంత్రుల కృషి ఫలితంగా మరో అతిపెద్ద డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్కు రానుంది.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఏఐ రంగానికి విశాఖపట్నం గ్లోబల్ హబా మారుతోంది. విశాఖ జిల్లా జగన్నాథపురంలో దాదాపు 200 ఎకరాల్లో ఆర్ ఎం జెడ్ మరియు ‘కోల్ట్ డేటా సెంటర్స్’ సంయుక్తంగా 1.25 జి డబ్ల్యు సామర్థ్యంతో ఏకంగా రూ. 1.77 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. ఎస్ ఐ పి సి దీనికి వేగంగా ఆమోదం తెలిపింది. దావోస్ పర్యటనలో మంత్రులు కుదుర్చుకున్న ఒప్పందం 7 నెలల్లోనే కార్యరూపం దాల్చడం విశేషం. గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలతో పాటు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రాష్ట్రం నిర్దేశించుకున్న 6 జి డబ్ల్యు లక్ష్యానికి ఏపీ మరింత చేరవైంది.