విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు PMNRF నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్రేషియా ప్రకటించారు. స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు.