వి.బి.జి. రాంజీ పథకాన్ని ప్రారంభించి పేదల కడుపు కొట్టొద్దు- రాష్ట్రప్రధాన కార్యదర్శి లోకనాథం

సత్యవేడు జూలై 02 గరుడధాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వి.బి.జి. రాంజీ పథకాన్ని రద్దు చేసి, ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నే కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం సత్యవేడులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం పాల్గొని మాట్లాడారు. వామపక్షాల పోరాట ఫలితంగా...