పిచ్చాటూరు, జూన్ 8 గరుడధాత్రి :
ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు సోమవారం పిచ్చాటూరులో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వోలు), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో ఈనెల 8న రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా
పని ఒత్తిడి తో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు వి ఆర్ ఓ మహమ్మొద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వీఆర్‌టీ మరియు వీఆర్‌ఏల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంఘం ద్వారా గతంలో సమర్పించిన వినతులను పరిశీలించి పరిష్కారం చూపాలని కోరారు.
అదనపు పని భారం తగ్గించే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదించి తగిన చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొని వినతిపత్రంపై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు మండల రెవెన్యూ అధికారుల అధ్యక్షుడు టి జానకి రామన్, ఉపాధ్యక్షురాలు ప్రియాంక, ట్రెజరర్ భూపతి,వీఆర్వోలు రఘుపతి . కృష్ణన్. ఇళయరాజ,గ్రామ రెవెన్యూ సహాయకుల అధ్యక్షుడు మునిశేఖర్ మరియు వీఆర్ఏలు అందరూ సర్వేయర్లు సూర్య ఏ ఎస్ ఓ రామ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.