వీఆర్‌వోల సమస్యల పరిష్కారానికి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

పిచ్చాటూరు, జూన్ 8 గరుడధాత్రి : ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు సోమవారం పిచ్చాటూరులో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వోలు), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో ఈనెల 8న రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా పని ఒత్తిడి తో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు వి ఆర్ ఓ మహమ్మొద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులు...