వీరప్పల్లి గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

పలమనేరు, జూన్ 17 ( గరుడ ధాత్రి ) : పలమనేరు నియోజకవర్గం, పెద్ద పంజాణి మండలం వీరప్పల్లిలో బుధవారం జరిగిన గంగమ్మ జాతరకు పలమనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆ తల్లి చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలని, వర్షాలు సకాలంలో కురవడంతో పాటు పంటలు బాగా పండి అందరు సుఖశాంతులతో ఉండేలా ఆ అమ్మ దీవెనలు మనకు ఉండాలని ఆయన వేడుకున్నారు. అనంతరం గ్రామస్తులు ఆయన్ను ఆలయ మర్యాదలతో...