వృత్తి విద్యార్థులకు పారిశ్రామిక సందర్శన
కార్వేటినగరం సెప్టెంబర్ 19 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం: పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లెలో వృత్తి విద్యా బోధనలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు పారిశ్రామిక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు విద్యతోపాటు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెంగల్ రాజు తెలిపారు.పాఠశాలలో నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సులకు చెందిన 50 మంది పదో తరగతి విద్యార్థులు ఈ సందర్శనలో పాల్గొన్నారు. ట్రేడ్‌కు చెందిన 25 మంది విద్యార్థులను వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ హరికృష్ణ...