GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:02 am Digital Edition : GURU SWAMY

వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం

సత్యవేడు అక్టోబర్ 3 గరుడధాత్రి:

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పం పంచాయతీలో గురువారం వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు వృద్ధాప్య పెన్షన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత సుందరరామిరెడ్డి, రవిరెడ్డి, లోకయ్యరెడ్డి, ఎంఈఓ రవి, మహిళా పోలీస్ లక్ష్మీ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పలువురు పెన్షన్ లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరయ్యారు.