GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:23 pm Digital Edition : GURU SWAMY

​వెంకటగిరి పట్టణంలో ఘనంగా “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” ప్రచారం

21వ వార్డులో పర్యటించి, ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ

​వెంకటగిరి, ఆగస్టు 04, 2026:

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” ప్రచార కార్యక్రమం వెంకటగిరి పట్టణంలో ఉత్సాహంగా జరిగింది.

మంగళవారం ఉదయం 21వ వార్డ్, పీర్జాతీపేటలోని మందా నాంచారమ్మ గుడి వద్ద నుండి గౌరవ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ, గత ప్రభుత్వానికి మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక విద్యార్థులతోనూ ఆయన ముచ్చటించారు.
ప్రజలకు ఎమ్మెల్యే వివరించిన ప్రధాన సంక్షేమ పథకాలు ఇవే

తల్లికి వందనం: గత ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే సాయం అందేది. కానీ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ. 15,000 చొప్పున ఆర్థిక సాయం

​ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000, బెడ్ కే పరిమితమైన వారికి రూ. 15,000 చొప్పున పింఛన్ల పంపిణీ.
అన్న క్యాంటీన్లు: పేదవాడి ఆకలి తీర్చడానికి రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే భోజనం.
*చేనేత కార్మికులకు: 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం.
*​అన్నదాత సుఖీభవ: ప్రతి రైతుకు రూ. 20,000 ఆర్థిక సాయం.*
*​ఆటో డ్రైవర్లకు & మత్స్యకారులకు: ఆటో డ్రైవర్లకు రూ. 15,000 మరియు మత్స్యకారులకు రూ. 20,000 చొప్పున ఆర్థిక సాయం.*
*​పేదలకు ఇళ్లు & వైద్యం: 5 లక్షల మంది పేదలకు ఇళ్ల నిర్మాణం. సీఎంఆర్ఎఫ్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉచిత వైద్యం.*
*​గీత కార్మికులకు: మైనింగ్, వైన్ షాపుల కేటాయింపుల్లో ప్రాధాన్యత.*

*​21వ వార్డు వాసులకు ఎమ్మెల్యే హామీలు:*
*వార్డులో పర్యటించిన సందర్భంగా ప్రజలు తెలిపిన సమస్యలపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. వార్డులో డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని, ప్రతి ఇంటికి అరగంట పాటు త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని, అలాగే కొత్తగా బోరు వేయిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.*

*వెంకటగిరి నియోజకవర్గానికి ఇప్పటికే 7-8 కోట్లు cmrf నిధులు కేటాయించామని, త్వరలో మరో 50 లక్షల రూపాయలు రానున్నాయని ఆయన తెలిపారు.*

*ఈ కార్యక్రమంలో AMC చైర్మన్, పట్టణ అధ్యక్షులు, మాజీ AMC చైర్మన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, మాజీ పట్టణ అధ్యక్షులు, తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జీలు, కమిటి నాయకులు, యువత నాయకులు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు మరియు పాల్గొన్నారు.*