వెంకటగిరి పట్టణంలో ఘనంగా “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” ప్రచారం
21వ వార్డులో పర్యటించి, ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి, ఆగస్టు 04, 2026: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇంటింటికి కూటమి ప్రభుత్వం" ప్రచార కార్యక్రమం వెంకటగిరి పట్టణంలో ఉత్సాహంగా జరిగింది. మంగళవారం ఉదయం 21వ వార్డ్, పీర్జాతీపేటలోని మందా నాంచారమ్మ గుడి వద్ద నుండి గౌరవ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే స్వయంగా...