*పంట పొలాల మీదకు వచ్చిన ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్ళిస్తున్న రైతన్నలు
*రాత్రి 9 గంటలు కాకమునుపే పంట పొలాల మీదకు వస్తున్న ఒంటరి ఏనుగు*
*ఒంటరి ఏనుగు నుండి మమ్మల్ని రక్షించండి అంటూప్రభుత్వం ను కోరుకొంటున్న రైతన్నలు*
బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్ 20
బైరెడ్డిపల్లి మండలం లోనివెంగం వారి పల్లి కొత్తచెరువులో ఆదివారం రాత్రి 9 గంటలకు మునుపే పంట పొలాల పై ఒంటరి ఏనుగు సంచరిస్తుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది.
సమయాలతో సంబంధం లేకుండా గడిచిన 20 రోజుల నుండి ఒంటరి ఏనుగు అటవీ సరిహద్దు గ్రామాల రైతన్నలకు కంట పడుతూనే ఉన్నది
ఈ ఒంటరి ఏనుగు నుండి మమ్మల్ని రక్షించండి అంటూ రైతన్నలు ప్రభుత్వంకు మొరపెట్టుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఒంటరి ఏనుగు ను మరో ప్రాంతంకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటవీ అధికారులు కుంకి ఏనుగు సహాయంతో ఈ మండలం నుండి తరలించాలని రైతన్నలు కోరుకొంటున్నారు.