వెంగమవారిపల్లి రైతు పొలంలోని టమోటా పంటపై దాడి చేసిన ఒంటరి ఏనుగు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్2 బైరెడ్డిపల్లి మండలంలోని వెంగం వారిపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు ,మాజీ ఎంపిటిసి రైతు పొలంలోకి గురువారం రాత్రి ఒంటరి ఏనుగు చొరబడి తొడుగులు సాయంతో ఏర్పాటు చేసిన టమోటా తోటపై దాడి చేసి నష్టం చేకూర్చింది. వేకువ జామునే గమనించిన రైతన్న సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గడిచిన మూడు నెలలుగా ఏనుగులు రైతన్న పంట పొలాల మీదకు వస్తున్నాయని, వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతన్న వాపోయారు. గడిచిన మూడు నెలలుగా అటవీ సరిహద్దు...