GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 5:48 am Digital Edition : GURU SWAMY

వెంగళతూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన

పిచ్చాటూరు, సెప్టెంబర్ 25 గరుడధాత్రి న్యూస్:

పిచ్చాటూరు మండలం వెంగళతూరు గ్రామంలోని పిచ్చాటూరు ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్లు కల్పలత, సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు ఆరోగ్యం, పోషకాహారం, పిల్లల సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, చిన్నారులకు సమతుల్య ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడవచ్చని వివరించారు. అదేవిధంగా పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నులిపురుగుల నివారణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, తగిన వైద్య సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షురాలు నిత్య, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, రూత్ మేరీ, సంగీత, ప్రభ, సహాయకురాలు సుజ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.