వెంగళతూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన పిచ్చాటూరు, సెప్టెంబర్ 25 గరుడధాత్రి న్యూస్: పిచ్చాటూరు మండలం వెంగళతూరు గ్రామంలోని పిచ్చాటూరు ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్లు కల్పలత, సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు ఆరోగ్యం, పోషకాహారం, పిల్లల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, చిన్నారులకు సమతుల్య ఆహారం అందించడం ద్వారా...