వెంగళత్తూరులో ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన సదస్సు
సైబర్ మోసాలు, గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలి పిచ్చాటూరు, సెప్టెంబర్ 27 గరుడధాత్రి: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర సూచించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పిచ్చాటూరు మండలం వెంగళత్తూరు దళితవాడలో ఆదివారం ‘ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై స్థానికులకు అవగాహన...