వెండితెరపై మొదలైన కథ.. రాజకీయాల్లో చరిత్రగా మారింది

దక్షిణ భారత రాజకీయాల్లో సినిమా ప్రభావం ఎంత లోతుగా వేరూరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెండితెరపై స్టార్‌డమ్ సాధించిన నేతలు, అదే ప్రజాదరణను రాజకీయాల్లోకి మలుచుకుని ముఖ్యమంత్రులుగా ఎదిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రయాణాల్లో వారి వ్యక్తిగత అనుబంధాలు-ముఖ్యంగా సినీ నటీమణులతో ఉన్న సంబంధాల-ఎప్పటికప్పుడు ప్రజల్లో ఆసక్తి, చర్చలకు కారణమయ్యాయి. గతంలో ఎంజీఆర్-జయలలిత జోడీ ఎలా చర్చనీయాంశమైందో, నేడు విజయ్-త్రిష పేర్లు కూడా అదే తరహాలో వినిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఎంజీఆర్,...