GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 1:06 pm Posted by : GARUDA DHATRI NEWS

వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత వైసీపీకిలేదు

రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసం చేసి, యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వైసీపీ నేడు ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదంగా ఉందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి పృథ్వీరాజ్ ఏద్దేవా చేశారు.
టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో . ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికీ జీర్ణించుకోలేని జగన్ అండ్ కో అసత్య ప్రచారాలతో రాజకీయ మనుగడ కోసం తంటాలు పడుతున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం…
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవేదన…
*ఇదే వైసీపీ రాజకీయాల అసలు రూపం అని ఘాటుగా విమర్శించారు.
నిరుద్యోగుల గురించి మాట్లాడే ముందు, వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని, . వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రాన్ని ఎందుకు వదిలి వెళ్లాయో చెప్పాలని నీలదీశారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఘోరంగా విఫలమైన వైసీపీ నేడు యువతకు మద్దతుదారులమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రజల సంక్షేమం పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టిన వైసీపీ పాలన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందన్నారు . ఆ పరిస్థితులను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే, ఓటమి బాధతో వైసీపీ నేతలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. కానీ వైసీపీ నాయకులు మాత్రం తమ పాలనలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నిరసనల పేరుతో చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అబద్ధాలతో, ఆరోపణలతో ప్రజల విశ్వాసాన్ని మళ్లీ సంపాదించలేరని స్పష్టం చేశారు.

2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వైసీపీ అహంకారానికి గట్టి చెంపపెట్టులాంటిదన్నారు.ప్రజలను బెదిరించి, వ్యవస్థలను దుర్వినియోగం చేసి, ప్రతిపక్షాలను అణగదొక్కిన పాలనకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు సమాధానం చెప్పారని, అదే వైసీపీకి అతిపెద్ద రాజకీయ గుణపాఠమన్నారు.

రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా, మహిళలకు సాధికారత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని కుండబద్దలు కొట్టారు.

ప్రజలను మోసం చేసిన వారిని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని,
*మళ్లీ అదే నాటకాలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదని తేల్చి చెప్పారు.