సత్యవేడు మే 4 గరుడధాత్రి :
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి ఓడూరు ఉజ్వల రెడ్డి విమర్శించారు.ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగించడంతో పాటు మరిన్ని కొత్త పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆ పథకం అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన హామీలు కూడా అమలు కాలేదన్నారు.రైతులకు ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి రైతులను నిరాశపరిచారని, ఆరోగ్యశ్రీ పథకాన్ని బలహీనపరిచారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి నెలకు రూ.10,000 వేతనం ఇస్తామని చెప్పిన హామీ కూడా నెరవేరలేదని, ఇది వాలంటీర్లకు చేసిన వెన్నుపోటేనని ఆయన అన్నారు.ప్రజలు ఈ విషయాలను గమనించి రానున్న 2029 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.