వెలగని వీధిలైట్లతో చీకట్లో పేరడం గ్రామం
-తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు గరుడధాత్రి : తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని పేరడం గ్రామంలో వీధిలైట్లు వెలగకపోవడంతో గ్రామం మొత్తం చీకట్లో మగ్గుతోంది. గత కొన్ని రోజులుగా ప్రధాన వీధులతో పాటు అంతర్గత రహదారుల్లో కూడా లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో గ్రామంలో నడవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటిని ఆసరాగా చేసుకుని పాములు, విషకీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు రాత్రి...