GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 7:19 am Posted by : GURU SWAMY

వెలవెల బోతున్న100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల

-జిల్లా విద్యాశాఖ అధికారులు మా పాఠశాల ను కడపనత్తంలో కొనసాగించక పోతే ప్రవేటు పాఠశాలలోమా పిల్లలను చేరుస్తాం.

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్12

బైరెడ్డిపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో శుక్రవారం పిల్లలతో గదులు కళకళాడుతుంటే కడపనత్తo పాఠశాల మాత్రం ఖాళీ గదులు దర్శనమిస్తున్నది. ఈ నేపథ్యంలోపంతులమ్మ మాత్రం దిక్కుతోచని స్థితిలో హాజరు రిజిస్టర్ చూసుకొంటున్నది.
తల్లిదండ్రులే పిల్లల్ని నిలిపివేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతు
మా గ్రామoలో సుమారు 35 మంది పై పిల్లలున్నారు….మా గ్రామoలోనే 3,4,5 తరగతులు కోనసాగించాలి.
ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు మేము పంపించలేం అంటూ తల్లిదండ్రులు ఆవేదన
మా గ్రామoలోనే 1 నుండి 5 వరకు చదువులు కొనసాగించాలని మంత్రి లోకేష్ ను కూడా ఇటీవలనే కలిసాం మంత్రి కూడా స్పందించి మీ కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని…
మంత్రిని కలిసిన
రెండు రోజులకే మండల విద్యాశాఖ సిబ్బంది తీపి కబురు చెప్పారు. కానీ శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలు పిల్లలతో ఉంటే ఈ గ్రామoలో ఉన్న పాఠశాల మాత్రం ఖాళీ గదులు దర్శనం ఇస్తూ వెలవెల పోతున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామస్థులు,విద్య కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు కు తరలివెళ్లి ఇంచార్జీ డి.ఈ ఓ.కు తమ గోడు వెళ్లబోసుకొని తమ గ్రామంలో నే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు కొనసాగిస్తేనే లేని పక్షంలో తమ పిల్లలను ప్రవేటు పాఠశాలలో చేరుస్తాం అని ఖరాఖండిగా సమాదం ఇచ్చారు.మా పాఠశాల పై విద్య శాఖ తమ అభిప్రాయం మార్చుకొని కడపనత్తంలోనే 1నుండి 5 వరకు తరగతులు కొనసాగేలా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు.