GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:53 am Digital Edition : GURU SWAMY

వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో వైభవంగా ప్రత్యేక పూజలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు1

బైరెడ్డిపల్లి మండలంలోని శ్రీ*వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని కడపనత్తం గ్రామం లో వెలసిన శ్రీ నల్గొండరాయస్వామి ఆలయంలో అర్చకులు రామకృష్ణమాచార్యులు చే పంచామృత అభిషేకం చేపట్టారు.అనంతరం స్వామి,అమ్మవార్లను ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టి మహామంగళహారతి చేసి భక్తులకు గీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మండలంలోని మురారిపల్లి లోవెలసివున్న శ్రీ ఓబులేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు తిపాచార్యులు చే అబిజిషేకం,విశేష పూజలు చేశారు. భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మండలంలోని పెద్దాపురం లో నెలకొని ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అభిషేకం, విశేష పూజలు ను అర్చకులు పార్థసారథి స్వామి చే కొనసాగింది.భక్తులకు ఉభయదార్లు తీర్థ ప్రసాదాలు వితరణ చేపట్టారు.